ఘాటైన సువాసనే కాదు... కమ్మని రుచీ పుదీన సొంతం. ఈ రెండే కాదు ఆరోగ్యానికీ పుదీన చేసే మేలు ఎంతో ఉంటుంది. ముఖ్యంగా వేడికి విరుగుడుగా పని చేసే పుదీనతో ఎన్నో వెరైటీలు తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్నింటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
జల్ జీరా తయారీకి కావాల్సినవి
- పుదీనాఆకులు–అరకప్పు
- కొత్తిమీర తరుగు - అర కప్పు
- అల్లం తరుగు - అర టీ స్పూన్
- నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర పొడి - అరటీస్పూన్
- ఇంగువ - పావు టీ స్పూన్
- ఉప్పు - తగినంత.
- మిరియాల పొడి - పావు టీ స్పూన్
- చక్కెర - 1 టీ స్పూను
- ఆంచూరు పొడి – 2 టీ స్పూన్లు
- చింతపండు గుజ్జు-1 టేబుల్ స్పూన్
- నీళ్లు– 4 కప్పులు
జల్ జీరా తయారీ విధానం
ముందుగా పుదీన, కొత్తిమీరను శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని అల్లం తరుగు, అర కప్పు నీళ్లతో కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి.
ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీ సుకోవాలి. అందులో నిమ్మరసం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఇంగువ, ఉప్పు, చక్కెర, అంచూర్ పొడి, చింతపండు గుర్తు, మిగిలిన నీళ్లు పోసి బాగా కలపాలి ఆ గిన్నెను 3-4 గంటల పాటు ఫ్రిజ్లోలో పెట్టాలి అంతే.
ఎంతో రుచికరమైన జల్ జీర రెడీ. దీన్ని సర్వే చేసుకునేటప్పుడు కావాలంటే ఉడికించిన బరాణీ లేదా శెనగలు వేసుకోవచ్చు.. సూపర్ గా ఉంటుంది
పుదీనా చికెన్ తయారీకి కావలసినవి
- చికెన్–అరకిలో
- పుదీనా ఆకులు - 1 కప్పు
- కొత్తిమీర తరుగు - అర కప్పు
- ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు
- పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్ స్పూన్
- అల్లం తరుగు - అర టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 5
- పసుపు – 1 టీస్పూన్
- కారం - 2 టీస్పూన్లు
- గరం మసాలా - 2 టీస్పూన్లు
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- ఉప్పు- తగినంత
- నూనె – సరిపడ
పుదీనా చికెన్ తయారీ విధానం
ముందుగా చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి.
మరోవైపు మిక్సీలో పావు కప్పు ఉల్లి, గడ్డ తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి రెబ్బలు, పుదీన ఆకులు వేసి గ్రైండ్ చేయాలి.
స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక.. అందులో మిగిలిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేగించాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ వేసి 10 నిమిషాలు ఫ్రై చేయాలి.
అందులో ఉల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికాక... కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి
